Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!
Megastar Chiranjeevi Meets his fan Nagaraju: మెగాస్టార్ చేసిన పనికి ఆయనకు సోషల్ మీడియాలో ప్రసంశల వర్షం కురుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Megastar Chiranjeevi Meets his fan Nagaraju: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవిని అనేకమంది అభిమానిస్తూ ఉంటారు. ఆయనని అభిమానించేవారు ఆయనలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ హీరోకి తగ్గ అభిమానులు అనిపించుకుంటూ ఉంటారు. నిజానికి మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు అంటే అందులో అతిశయోక్తి లేదు.
ఇక ఆయనను జీవితంలో ఒక్కసారి అయినా కలవాలని ఒక ఫోటో దిగాలని ఉవిళ్లూరే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే మెగాస్టార్ కూడా తన అభిమానుల పట్ల అలాగే తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా తన ఊరికి చెందిన ఒక అభిమాని ప్రాణాలతో పోరాడుతున్న విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ తన ఇంటికి పిలిపించుకుని ఆయనతో సమయం నడిపి ఆయనకు మరిచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చారు. చిరంజీవి సొంత గ్రామం మొగల్తూరుకి చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.
చిన్ననాటి నుంచే మెగాస్టార్ అభిమానిగా ఉన్న నాగరాజుకి ఈమధ్య అనారోగ్యం ఏర్పడింది. అతనికి రెండు కిడ్నీలు కూడా పాడయ్యాయి. అయితే ఎలా అయినా తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఉందని అదే తన చివరి కోరిక అనే విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘాల దృష్టికి తీసుకువెళ్లారు నాగరాజు. ఇక అలా ఈ విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన ఊరికి చెందిన అభిమాని చివరి కోరిక తీర్చారు.
నాగరాజును కుటుంబ సమేతంగా తన నివాసానికి ఆహ్వానించడమే కాక ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నాగరాజుతో పాటు అతని కుటుంబ సభ్యులతో దాదాపు సుమారు గంటపైగా సమయం గడిపారు. అలాగే మీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండాలని ధైర్యం ఇవ్వడమే గాక కొంత ఆర్థిక సాయం కూడా చేశారు చిరంజీవి. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అభిమానిని ఇంటికి పిలిపించుకోవడమే గాక హత్తుకుని ఆయనకి అభయం ఇవ్వడమే గాక ఆర్థిక సాయం కూడా చేయడంతో మెగా అభిమానులు దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి షూటింగ్స్ నిలిచిపోయిన నేపథ్యంలో ఆయన ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. అభిమానికి కష్టం వచ్చిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ఇంటికి పిలిపించడమే కాక వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా వారితో సమయం గడిపారు మెగాస్టార్.
Also Read: Neha Shetty: లెహంగాలో రాధిక అందాల విందు.. క్లీవేజ్ సోకులతో వలపు వల!
Also Read: Manushi Chhillar: బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చిన మానుషి.. సాగరతీరాన సాగరకన్యలా అందాల వల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook