`ఇదిగో.. ఛాలెంజ్‌ను పూర్తి చేశా..`
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన `హరితాహారం` కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. హరితాహారంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించి.. ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించారు. తెరాస ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్, సినీ దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా హరితాహారం (గ్రీన్) ఛాలెంజ్‌ను సినీ నటుడు మోహన్‌బాబు స్వీకరించారు. కేథరిన్ హడ్డా ఇటీవలే కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి.. మోహన్‌బాబు, సానియా మీర్జాలను నామినేట్ చేశారు. దీనిపై మోహన్‌బాబు స్పందిస్తూ.. ఛాలెంజ్‌ను స్వీకరించానని చెప్పి.. మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘ఛాలెంజ్‌ను కంప్లీట్ చేశా. విద్యానికేతన్‌లోని మా స్టూడెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరుతున్నా. మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం అవసరం. మొక్కలు నాటుతున్న మీ ఫొటోలను నాకు పంపించండి’ అని మోహన్‌బాబు ట్విట్టర్‌లో తెలిపారు.