నటీ నటులు : అల్లు అర్జున్, అను ఇమ్మా నుయెల్, అర్జున్, శరత్ కుమార్, నదియా, బోమన్ ఇరానీ, వెన్నెల కిషోర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాటోగ్రఫి :  రాజీవ్ రవి


ప్రొడక్షన్ డిజైన్ : రాజీవన్


సంగీతం : విశాల్ – శేఖర్


సమర్పణ : k.నాగబాబు


సహ నిర్మాత : బన్నీ వాసు


నిర్మాణం : రామలక్ష్మీ సినీ క్రియేషన్స్


నిర్మాత : శిరీషా శ్రీధర్ లగడపాటి


రచన, దర్శకత్వం : వక్కంతం వంశీ


రిలీజ్ డేట్ : 4 మే 2018


సెన్సార్ – U/A
 


కొత్త దర్శకులకు బన్నీ ఛాన్స్ ఇవ్వడు. అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో సుకుమార్ ను నమ్మాడు. మళ్లీ ఇన్నేళ్లకు వక్కంతంను నమ్మాడు. మరి బన్నీ నమ్మకం నిజమైందా..? బన్నీ-వక్కంతం కాంబినేషన్ వర్కవుట్ అయిందా..? నా పేరు సూర్య రిజల్ట్ ఏంటి..? జీ న్యూస్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ.



కథ :
సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు.


అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు  సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.
 


నటీనటుల పనితీరు:
మిలట్రీ మేన్ సూర్యగా బన్నీ అదరగొట్టాడు. అతడి యాక్టింగ్, స్టయిల్, మేకోవర్, క్యారెక్టర్ కోసం పడిన కష్టం… ఇలా అంతా ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. సినిమాలో బన్నీ వన్ మేన్ షో కనిపిస్తుంది . ఇంకా చెప్పాలంటే బన్నీ కెరీర్ లో ది బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది సూర్య పాత్ర. హీరోయిన్ గా చేసిన అను ఎమ్మాన్యుయేల్ గ్లామరస్ గా మాత్రమే ఎట్రాక్ట్ చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి సెటిల్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. బోమన్ ఇరానీ, వెన్నెల కిషోర్, అనూప్ సింగ్, శరత్ కుమార్ తమ పాత్రల మేరకు నటించారు.

 


టెక్నీషియన్స్ పనితీరు :
రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, రాజీవన్ ఆర్ట్ వర్క్ బాగుంది. విశాల్ శేఖర్ 2 పాటలతో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. ముఖ్యంగా సైనిక పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, బ్యూటిఫుల్ సాంగ్ కి సిరివెన్నెల సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. ఇక లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సో సాంగ్ కి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ లబిసి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.


రామ్ లక్ష్మణ్ మాస్టరస్, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన స్టంట్స్ హైలైట్ గా నిలిచాయి. ‘లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సొ’ పాటకి కొరియోగ్రఫీ బాగుంది. క్యాప్ ట్రిక్స్ స్క్రీన్ పై బాగా క్లిక్ అయ్యాయి. ఇరగ ఇరగ సాంగ్ బాగున్నప్పటికీ ప్లేస్ మెంట్ కుదర్లేదు. మంచి ఊపుమీద సాగుతున్న సినిమాకు బ్రేకులేసింది ఈ పాట. వక్కంతం డైరెక్షన్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే సెట్ కాలేదు. రామలక్ష్మీ సినీక్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
 
సమీక్ష:

బన్నీ మిలట్రీ ఆఫీసర్ గా నటించాడు కాబట్టి ఇదొక దేశభక్తి సినిమా అనుకోవద్దు. ఇందులో దేశభక్తి ఉన్నప్పటికీ, సినిమా మొత్తం సూర్య అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సూర్య అనే సైనికుడి లైఫ్ ను రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. క్యారెక్టర్ ను బ్రహ్మాండంగా రాసిన వక్కంతంకు, దాన్ని అంతే అద్భుతంగా పోషించిన బన్నీకి హేట్సాప్ చెప్పాల్సిందే.


రైటర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న వక్కంతం వంశీ తన డెబ్యూ సినిమాకు మంచి పాయింట్ ను సెలక్ట్ చేసుకున్నాడు కానీ గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. బన్నీని మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపించి, అర్జున్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన వక్కంతం మిగతా క్యారెక్టర్స్ విషయంలో కూడా అంతే శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఆడియన్స్ కు మరింత కనెక్ట్ అయ్యేది.


దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్దమైన ఓ సైనికుడు బోర్డర్ లో నిలబడాలనుకుని దానికి అడ్డుగా నిలిచిన కోపం అనే లోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాడా..? అనే పాయింట్ ను ఎంచుకున్న దర్శకుడు ఆ పాయింట్ చుట్టూ మంచి సెటప్ నే క్రియేట్ చేయగలిగాడు. కానీ ఆ క్రియేషన్ లో భాగంగా గతంలో తను రైటర్ గా పనిచేసిన కొన్ని సినిమాల్లో సీన్స్ నే మళ్లీ రిపీట్ చేశాడు. వీటితో పాటు సినిమాలో తండ్రి-కొడుకు, తల్లి-కొడుకు థ్రెడ్స్ కూడా సింక్ అవ్వలేదు.


ఇలాంటి చిన్నచిన్న లోపాల్ని పక్కనపెడితే, ఓవరాల్ గా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు బన్నీ. సినిమా కోసం అతడు ఎంత కష్టపడతాడో తెలియాలంటే నా పేరు సూర్య చూడాలి. కొన్ని సన్నివేశాల్లో బన్నీ యాక్టింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. క్యారెక్టర్ ను అతడు ఓన్ చేసుకున్న విధానానికి ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాను చివరి వరకు నిలబెట్టిన ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బన్నీ ఎప్పీయరెన్స్ మాత్రమే. మధ్యమధ్యలో వక్కంతం దర్శకత్వ ప్రతిభ సినిమాకు దన్నుగా నిలిచింది.
 


ప్లస్ పాయింట్స్
– అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్
– అర్జున్ యాక్టింగ్
– కొన్ని ఎమోషనల్ సీన్స్
– ఫైట్స్

 


మైనస్ పాయింట్స్
– క్లయిమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం
– లవ్ ట్రాక్

 


బాటమ్ లైన్ – టైటిల్ కు తగ్గ సినిమా
 


రేటింగ్ – 3.25 /5


(జీ సినిమాలు సౌజన్యంతో)