Pawan Kalyan On Aha Promo పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తన సినిమా ప్రమోషన్స్‌లోనే ఎక్కువగా కనిపించడు. అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్టుగా రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చిరంజీవి హోస్ట్ చేసిన షోలకు కూడా పవన్ కళ్యాణ్‌ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఇలా బాలయ్యతో కలిసి షోలో పాల్గొనడంతో ఆ ఎపిసోడ్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో బజ్ నెలకొంది. ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలా అని పిలవని అందరితో చెబుతుంటాను అని బాలయ్య అంటే.. నేను ఓడిపోవడానికి సిద్దంగా ఉన్నా మీరున్నారా? అని పవన్ కళ్యాణ్‌ అడుగుతాడు. ఇవే పాలిటిక్స్ వద్దని అంటున్నా అని బాలయ్య కౌంటర్ వేస్తాడు. మీ అన్నయ్య దగ్గరి నుంచి నేర్చుకున్నది ఏంటి?.. వద్దని అనుకున్నవి ఏంటి? అని బాలయ్య ఇరుకున పెట్టేశాడు. దానికి పవన్ కళ్యాణ్‌ ఏం సమాధానం చెప్పాడన్నది ఆసక్తికరంగా మారింది.



రాష్ట్రంలో మీకు ఫ్యాన్ కానివారు ఎవ్వరూ లేరు కదా?.. మరి ఆ ప్రేమ అంతా కూడా ఓట్లకు ఎందుకు మారలేదని అనుకుంటున్నారు? అని బాలయ్య అడిగేశాడు. దీనికి కూడా పవన్ కళ్యాణ్‌ ఏ సమాధానం చెబుతాడో చూడాలి. మొత్తానికి బాలయ్య మాత్రం ఎక్కువగా ఇరికించే ప్రశ్నలే వేసినట్టు కనిపిస్తోంది. మరి వీటికి ఎలా రియాక్షన్లు ఇస్తాడో చూడాలి.
 


అసలే ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్‌ రిలీజ్ చేసిన టైంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆహా మీద దాడి చేసినట్టు అయింది. ఆ దెబ్బతో ఆహా కొన్ని గంటల పాటు క్రాష్‌ అయింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌లను రెండు పార్టులుగా చేసుకుని వ్యూయర్ షిప్ పెంచుకున్న సంగతి తెలిసిందే.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook