సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి నందమూరి అభిమానులను తీవ్రంగా కలచివేసింది. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఓ ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన హరికృష్ణ అంటే నందమూరి అభిమానులకు కూడా ఓ ప్రత్యేకమైన అభిమానం. నిగర్విగా పేరున్న హరికృష్ణ ఇటీవల తన అభిమానులను ఉద్దేశిస్తూ మీడియాలో ప్రచురించవల్సిందిగా మీడియా వారికి రాసిన ఓ లేఖ ఇప్పుడు అభిమానులను మరింత కన్నీరు పెట్టిస్తోంది. అభిమానులను ఉద్దేశిస్తూ మీడియాలో ప్రచురణార్థం హరికృష్ణ రాసిన ఈ చివరి లేఖ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"173389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nandamuri Harikrishna's last letter to his fans and pressnote","field_file_image_title_text[und][0][value]":"అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nandamuri Harikrishna's last letter to his fans and pressnote","field_file_image_title_text[und][0][value]":"అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ"}},"link_text":false,"attributes":{"alt":"Nandamuri Harikrishna's last letter to his fans and pressnote","title":"అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ","class":"media-element file-default","data-delta":"1"}}]]


రానున్న సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు కావడంతో, ఆరోజున తన పేరిట ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల దండల కోసం డబ్బు వృధా చేయకుండా ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా పంపించాల్సిందిగా హరికృష్ణ ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓవైపు కేరళలో, మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున, ఈ సమయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం సబబు కాదని హరికృష్ణ ఈ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒకరి గురించి ఆలోచించేంత మంచి మనసున్న మనిషి రోడ్డు ప్రమాదంలో ఇలా దుర్మరణం పాలవడం తమను మరింత ఆవేదనకు గురిచేసిందని నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.