National Film Awards 2022 Telugu Winners List: తాజాగా 68వ జాతీయ సినిమా అవార్డులను జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. తెలుగులో చిన్న సినిమాకి బెస్ట్ ఫిలిం అవార్డు రావడం ఆసక్తికరంగా మారింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో కలర్ ఫోటో ఫిలిం అవార్డు సంపాదించింది. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కొబ్బరి మట్ట దర్శకుడు సాయి రాజేష్ నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ద్వారా సునీల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఉత్తమ సంగీత చిత్రంగా అన్ని బాషలకు కలిపి అలవైకుంఠపురంలో సినిమాకి అవార్డు దక్కింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క నాట్యం సినిమాకు రెండో అవార్డులు దక్కాయి. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సంధ్యారాజుకి అవార్డు దక్కగా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఆ సినిమాకు పని చేసిన టీవీ రాంబాబుకి అవార్డు దక్కింది.


ఇక ఉత్తమ నటుడి అవార్డును ఈ ఏడాది ఇద్దరు స్టార్ హీరోలు పంచుకోబోతున్నారు. సూరారై పోట్రు సినిమాకి గాను సూర్య, తానాజీ సినిమాకు గాను అజయ్ దేవగన్ ఇద్దరికీ ఉత్తమ నటుడు అవార్డులు దక్కాయి. వీరిద్దరూ అవార్డును షేర్ చేసుకోబోతున్నారు. ఇక ఉత్తమ నటిగా సూరారై పోట్రు సినిమాకు అపర్ణ బాలమురళి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది ఫీచర్ ఫిలిమ్స్ జాబితాలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు నామినేట్ అయ్యాయి.


Also Read: Allu Arjun's Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప'ను ట్రోల్ చేస్తున్న యష్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?


Also Read: Telugu Movies in OTT: ఒకే రోజు 13 సినిమాలు.. ఏయే యాప్ లో ఏయే సినిమా వస్తుందంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook