ఇవాంకా జీఈఎస్ సదస్సులో పాల్గొనటానికి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే అజ్ఞాతవాసి పాటకు.. ఇవాంకా కు సంబంధం ఏంటీ.. అనేగా మీ డౌట్? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాంకా రాకతో హైదరాబాద్ లో ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ట్రాఫిక్ లో నవదీప్ చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని నవదీప్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 'బయటికెళ్లి చూస్తే టైమేమో 10' ఓ క్లాక్. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంకా రోడ్డు బ్లాక్'  అని సరదాగా ట్విట్ చేసాడు. 


ఈ పాట 'అజ్ఞాతవాసి' చిత్రంలోనిది. అసలు పాట 'బయటికెళ్లి చూస్తే టైమేమో 3'ఓ క్లాక్'. ఇంటికెళ్తున్న నవదీప్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ఈ పాట గుర్తొచ్చిందో ఏమో.. ఇవాంకాను ఉద్దేశిస్తూ ఇలా ట్వీట్ పెట్టాడు.