Honda City New Variant 2023: హోండా తమ మరో కొత్త కారును త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల చెయబోతోంది. ఈ కార్ల కంపెనీ ఇంయాలో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.. అయితే ఇంతక ముందు మార్కెట్‌లో విడుదలైన హోండా సిటీకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఈ కొత్త కారు రాబోతోందని సమాచారం.  హోండా ఈ బెస్ట్ సెల్లింగ్ కారును అప్‌డేట్‌ చేసి డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి మళ్లీ వినియోగదారులకు అందించనుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లతో పలు వేరింయట్స్‌లో ఈ కారు లభించనుంది. అయితే ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్‌ వంటి కొత్త అప్‌డేట్‌ మోడల్స్‌తో మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. ఈ కార్లు సాధరణ వినియోగదారులకు ప్రీమియంతో బడ్జెట్‌ ధరలో లభించనున్నాయి. అంతేకాకుండా హోండా సిటీకి సంబంధించిన ఈ కొత్త కారు విడుదలైతే మార్కెట్‌లో పలు కంపెనీ కార్లతో పోటి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కొత్త హోండా సిటీ ఎలా ఉండబోతోంది:
ఐదవ తరం హోండా సిటీ జూలై 2020లో భారత్‌లో విడుదల చేశారు.  ఇప్పుడు రాబోయే కొత్త మోడల్‌లో కొత్త ఫ్రంట్, రియర్ డిజైన్ బంపర్స్‌తో రాబోతోంది. అంతేకాకుండా కొత్త అల్లాయ్ వీల్స్ ఫీచర్‌ను కూడా ఇందులో చూడొచ్చు. అయితే ఇది వరకు ఉన్న సిటీ వేరియంట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి హైబ్రిడ్ సిస్టమ్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది.


ఇంజన్, గేర్‌బాక్స్:
కొత్త మోడల్ హోండా సిటీలో ఎలాంటి మెకానికల్ మార్పు చేయలేదని కంపెనీ పేర్కొంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 119 బిహెచ్‌పి పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి సామర్థ్యంతో మార్కెట్‌లోకి విడుదల కానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫీచర్‌ కూడా ఉండబోతోంది. ఇది 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌, రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండబోతోంది.  దీని పవర్ అవుట్‌పుట్, మైలేజ్ సాధారణ పెట్రోల్ ఇంజన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.


ధర ఇతర విషయాలు:
హోండా సిటీ కొత్త మోడల్ మార్చిలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ఈ సమాచారాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ మోడల్ మార్కెట్‌లో రూ. 11.87 లక్షల నుండి రూ. 15.62 లక్షల వరకు ఉండగా.. హైబ్రిడ్ మోడల్ ధర రూ. 19.89 లక్షలుగా ఉంది. అయితే రాబోయే సిటీలో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండడం వల్ల ధరలు కూడా ఎక్కువగా ఉండొచ్చు.


ఇది కూడా చదవండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి


ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్


ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook