అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారంటున్న తమన్నా
సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నెక్ట్ ఏంటి సినిమా టీజర్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'ఫనా', సైఫ్ అలీ ఖాన్-రాణి ముఖర్జీ జంటగా నటించిన హమ్ తుమ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. రైనా జోషి, అక్షయ్ పురి నిర్మించిన ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.