No Money for Terror: టెర్రర్ సపోర్ట్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి.. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి: ప్రధాని మోదీ
PM Narendra Modi speect at No Money for Terror Conference. ‘నో మనీ ఫర్ టెర్రరిజం’ అంతర్జాతీయ సదస్సు సమావేశంలో ఉగ్ర నిరోధక ఫైనాన్సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
PM Modi says We need to break terror support networks immediately at NMFT Conference: దశాబ్దాలుగా ఉగ్రవాదం వివిధ రూపాల్లో భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశం ధైర్యంగా పోరాడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడి దేశంలోని ఏ ప్రాంతంలో జరిగినా.. మన ప్రతిస్పందన తీవ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగే వరకు ఎదురుచూడకూదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. టెర్రర్ సపోర్ట్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలని, వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంత వరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని ఆయన తెలిపారు.
ఢిల్లీ వేదికగా శుక్రవారం జరిగిన ‘నో మనీ ఫర్ టెర్రరిజం’ (ఎన్‌ఎమ్‌ఎఫ్‌టి) అంతర్జాతీయ సదస్సు సమావేశంలో ఉగ్ర నిరోధక ఫైనాన్సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 'ఈ సదస్సు భారతదేశంలో జరగడం చాలా ముఖ్యం. ప్రపంచం తీవ్రంగా పరిగణించకముందే మన దేశం తీవ్రవాద భయానక పరిస్థితులను ఎదుర్కొంది. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటూనే ఉంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశం ధైర్యంగా పోరాడుతోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోం' అని ప్రధాని అన్నారు.
'తీఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చురుకైన, వ్యవస్థీకృత స్పందన చాలా అవసరం. మన దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే ఉగ్రవాదం మన ఇంటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించి మట్టుబెట్టాలి. ముష్కరులకు మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి. అప్పుడే వారికి సాయం లేకుండా చేయగలం. ఉగ్రదాడి దేశంలోని ఏ ప్రాంతంలో జరిగినా మన ప్రతిస్పందన తీవ్రంగా ఉండాలి' అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
'కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయి. ఆ దేశాలు ముష్కరులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటున్నాయి. అలాంటి వారిపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ప్రత్యక్షంగా అయినా లేదా పరోక్షంగా విస్తరిస్తోన్న ఈ ఉగ్రవాదంపై పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలి' అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను కోరారు. రెండు రోజుల పాటు ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఏ) సభ్యులు, ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు పాల్గొంటున్నారు. శనివారం ముగింపు సమావేశాల్లో భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు.
Also Read: Mahesh Babu foundation: హ్యాట్సాఫ్ మహేష్ .. కృష్ణ మరణించిన రోజే మరో గుండెకు ప్రాణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి