యన్.టి.ఆర్ బయోపిక్ టీజర్ విడుదలకు డేట్ ఖరారైందా ?
యన్.టి.ఆర్ బయోపిక్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైందా ?
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో మొదటి భాగం యన్.టి.ఆర్ కథా నాయకుడు కాగా రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న యన్.టి.ఆర్ కథా నాయకుడు సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. డిసెంబర్ 2న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కృష్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, టాలీవుడ్ మాచోమ్యాన్ రానా దగ్గుబాటి, అనుష్క వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ ఎంతోమంది పలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.