NTR`s `అరవింద సమేత` రిలీజ్ ; సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్
NTR నటించిన అరవింద సమేత గ్రాండ్ గా రిలీజయింది . హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ యాక్షన్ ఇమోషనల్ మూవీ అంచనాలకు మించి ఎంటర్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
NTR త్రివిక్రమ్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో తోనే హిట్ టాక్ అందుకోవడం గమనార్హం. యూత్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ చేసిన దర్శకుడు... ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో పాటు స్టోరీలోకి క్యారెక్టర్స్ ని ట్రావెల్ చేయించిన విధానం అద్భుతం అంటూ విమర్శలకు సైతం ప్రశంసిస్తున్నారు. దీంతో అరవింద సమేత ఫస్ట్ షో కే సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది.
ఈ మూవీలో NTR క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన విధానం సినిమాకి ప్రాణం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్ని సినిమాలొచ్చినా ఈ సినిమాలో సీమ సొగసును చూస్తారు అని త్రివిక్రమ్ అన్న మాట నిజమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.