ఉత్తమ నటి ఆస్కార్ ను దొంగలించేశాడు..!
90వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సోమవారం లాస్ ఏంజెల్స్ లోని డాల్బి థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
90వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ వేడుకలు సోమవారం లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డార్మాండ్, ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మ్యాన్ బంగారు ఆస్కార్ పురస్కారాలు అందుకున్నారు. అయితే ఈ ఆస్కార్ వేడుకలు పూర్తయాక అక్కడే ఉన్న టెర్రీ బ్రయంట్ అనే 47ఏళ్ల వ్యక్తి నటి ఫ్రాన్సెస్ అవార్డును దొంగలించాడు. 'త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ' అనే సినిమాకు గానూ ఫ్రాన్సెస్ కు ఉత్తమ నటి పురస్కారం దక్కింది.
అవార్డు చోరీకి గురైందని తెలుసుకొని ఫ్రాన్సెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అవార్డును దొంగలించేందుకు టెర్రీ టికెట్ కొనుక్కొని మరీ ఆస్కార్ వేడుకలకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కష్టపడి గెలుచుకున్న పురస్కారం చోరీకి గురికావడం పట్ల ఫ్రాన్సెస్ కంటతడి పెట్టారు. ఆ తరువాత పోలీసులు ఆవార్డును స్వాధీనం చేసుకున్నారని తెలిసి.. కృతజ్ఞతలు తెలిపారు.