'లండన్‌ బాబులు' సినిమా ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పలాస 1978'. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'పలాస 1978' సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్ర కథను అల్లుకున్నట్లు గతంలోనే కరుణ కుమార్ తెలిపారు. ఈ సినిమాకు తమ్మారెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై సినిమాను అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని సినిమాను ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన ట్రెయిలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ ట్రెయిలర్ ను 6 లక్షల మంది చూశారు.



Read Also: రజినీకాంత్ డిస్కవరీ షో ప్రోమో ఇదిగో..!!


సినిమా ట్రెయిలర్ ను బట్టి చూస్తే.. 1978లో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన ఓ హత్య ఆధారంగా కథను అల్లుకున్నట్లుగా తెలుస్తోంది.  సినిమా అంతా పూర్తి శ్రీకాకుళం యాసలో సాగుతోంది. ఈ సినిమాకు రఘు కుంచె సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: మిస్టర్ అండ్ మిస్ ట్రెయిలర్ విడుదల