బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పంగా'. కబడ్డీ క్రీడాకారిణిగా  కంగనా ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమా విడుదలకు ముందు మంచి టాక్ తెచ్చుకుంది. ట్రెయిలర్ రిలీజ్ కాగానే ..  'పంగా' రూపంలో  కంగనా రనౌత్  మరో హిట్ అందుకుంటుందన్న టాక్ వినిపించింది. ఐతే సినిమా అనుకున్నంత జోరుగా ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. తొలి రోజు కలెక్షన్ల రూపంలో చూసుకుంటే . .  కేవలం 2.7 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.  పంగా సినిమాతోపాటు రిలీజైన వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా సినిమా స్ట్రీడ్ డ్యాన్సర్ 3D సినిమా బాక్సాఫీస్ ను  షేక్ చేసింది. ఆ సినిమా తొలి రోజే 11 కోట్ల కలెక్షన్లు సాధించడం విశేషం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్లో కథనం.. 
కబడ్డీ క్రీడా నేపథ్యంలో 'పంగా' సినిమాను రూపొందించారు. 32 ఏళ్ల గృహిణి, మాజీ కబడ్డి క్రీడాకారిణిగా కంగనా రనౌత్ నటించింది. క్రీడా ప్రపంచంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి విజయాలు సాధించందన్నదే సినిమా నేపథ్యం. ఐతే  ఈ సినిమా కథనం .. చాలా స్లోగా ఉందనే టాక్ వినిపించింది. దీంతో కలెక్షన్లు తగ్గిపోయినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 'పంగా' సినిమాకు అశ్విని అయ్యర్ దర్శకత్వం వహించారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..