PM Kisan Yojana Eligibility List: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడతకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. దేశంలోని దాదాపు 1.86 కోట్ల మంది లబ్ధిదారులకు 13వ విడత డబ్బులు అందడం లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6 వేల నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రూ.2 వేల చొప్పున అకౌంట్లలో జమ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 కోట్ల మంది లబ్ధిదారుల పేర్లు తొలగింపు


12వ విడతకు ముందు రైతుల డేటాను క్లీన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్-లింక్డ్ ఫిల్టర్‌ను వర్తింపజేసింది. గత ఆరు నెలల్లో దాదాపు 2 కోట్ల మంది రైతుల పేర్లను తొలగించినట్లు తేలింది. అనర్హులను జాబితా నుంచి తీసివేసింది. 


11వ విడతలో 10.45 మంది రైతులు లబ్ధి పొందారు. అదేసమయంలో 12వ విడతలో 8.58 కోట్ల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరింది. కొత్త సంవత్సరంలో 13వ విడత సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేయనుంది. ఈ నేపథ్యంలో మీరు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. 


ఆధార్ లింక్ ఫిల్టర్‌లు తొలగించడంతో యూపీకి చెందిన దాదాపు 58 లక్షల మంది రైతులు ఈ పథకం నుంచి లబ్ధి పొందే అవకాశం కోల్పోయారు. అదేసమయంలో పంజాబ్‌లో లబ్ధిదారుల సంఖ్య 17 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గింది. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 14 లక్షల మందికి పైగా రైతుల పేర్లను కూడా తొలగించారు. ఇది కాకుండా అనేక రాష్ట్రాల్లో రైతుల పేర్లను జాబితాను నుంచి తీసేవేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల డేటాను పారదర్శకంగా చేయడానికి అనేక వడబోత కార్యక్రమాలను చేపట్టింది. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


రాజ్యాంగ పదవులలో పనిచేస్తున్న లేదా పనిచేసిన వారికి ఈ పథకం వర్తించదు. దీంతో పాటు మాజీ, ప్రస్తుత మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, పంచాయతీ అధినేతలకు కూడా ప్రయోజనం ఉండదు. దీంతో పాటు రాష్ట్ర లేదా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, 10 వేలకు పైగా నెలవారీ పింఛను పొందుతున్న వారు అనర్హులు. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులు. 


ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే వారు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. సొంత భూమి ఉన్న రైతు ఉంటే అది అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే.. వారికి కూడా ఈ పథకం వర్తించదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఇప్పటివరకు 12 విడతలుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కాగా.. ప్రస్తుతం ఈ పథకం 13వ విడతకు సంబంధించి నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డబ్బు డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడతకు సబంధించిన డబ్బులు జమ అయ్యే ఛాన్స్‌ ఉంది.


Also Read: Assembly Election Result 2022: నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. గెలుపు ఎవరిది..?  


Also Read: IND vs BAN: వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు షాక్.. ముగ్గురు ఆటగాళ్లు దూరం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి