ఐఐటి విద్యార్థికి `పూలదండ`ని బహుకరించిన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ముగ్ధుడైన రబేష్ కుమార్ సింగ్ అనే ఐఐటి విద్యార్థి ట్విట్టర్ ద్వారా భారత ప్రధానికి సందేశం పంపారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ముగ్ధుడైన రబేష్ కుమార్ సింగ్ అనే ఐఐటి విద్యార్థి ట్విట్టర్ ద్వారా భారత ప్రధానికి సందేశం పంపారు. " అయ్యా.. మీ ప్రసంగం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. అయితే మీరు ప్రసంగిస్తున్నప్పుడు వేసుకున్న బంగారు రంగు పూలదండ కూడా నాకు బాగా నచ్చింది. అలాంటిదే నాకు కూడా పంపించగలరా" అని ట్వీట్ చేయగా ఆ ట్వీట్‌కు భారత ప్రధాని స్పందించారు.
"నేను నీ సందేశాన్ని ట్విట్టర్‌లో చదివాను. మండ్లాకి వచ్చినప్పుడు నేను పంచాయితీరాజ్ దివస్ ఉత్సవాలలో పాల్గొన్నాను. ఆ సందర్భంగా నేను ధరించిన పూలదండ నీకు నచ్చిందని చెప్పావు. అందుకే ఈ పూలదండను నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్" అని ప్రధాని సందేశమిచ్చారు. ఆ సందేశంతో పాటు నిజంగానే అలాంటి దండను రబేష్ కుమార్‌కు పోస్టు ద్వారా పంపించారు
రబేష్ కుమార్ ప్రస్తుతం ఐఐటి (ధన్‌బాద్)లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ కుర్రాడు ప్రధాని రాసిన ఉత్తరంతో పాటు పంపించిన కానుకను చూసి ఆశ్చర్యపోయారు. "నాకు ప్రధాని నుండి ఉత్తరంతో పాటు కానుక రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ గతంలో కూడా పలుమార్లు ప్రోటోకాల్ నియమాలను పక్కనపెట్టి, తన అభిమానులను కలుసుకోవడం.. వారితో ముచ్చటించడం చేశారు.