ప్రేమ కథా చిత్రం 2 టీజర్.. కామెడి, హారర్ కలగలిపిన మిక్చర్ పొట్లం
ప్రేమ కథా చిత్రం 2 టీజర్ విడుదల
2013లో సుదీర్ బాబు, నందిత జంటగా వచ్చిన ప్రేమ కథా చిత్రం ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సైలెంట్‌గానే సూపర్ హిట్ అయి రూ.25 కోట్లకుపైనే రాబట్టింది. ఒక విధంగా హారర్ కామెడి సినిమాలకు మంచి ఊపునిచ్చిన ఈ సినిమాలో హాస్యనటులు ప్రవీన్, సప్తగిరి పండించిన కామెడి అంతా ఇంతా కాదు.. మారుతి డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్.. హారర్ కామెడి చిత్రాల్లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో మారుతితో కలిసి ఆ చిత్రాన్ని నిర్మించిన ఆర్పీఏ క్రియేషన్స్ తాజాగా మరోసారి ఆ సినిమాకు సీక్వెల్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. హరికిషన్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌కి ప్రేమ కథా చిత్రం అనే టైటిల్ కి కొనసాగింపుగా ప్రేమ కథా చిత్రం 2 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సీక్వెల్‌లో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత జంటగా నటించారు. తాజాగా మేకర్స్ ప్రేమ కథా చిత్రం 2 టీజర్ విడుదల చేశారు. పాత టచ్‌తోనే కామెడి, హారర్ సమపాళ్లలో రంగరించి రూపొందించిన టీజర్ ఇదే.