Premature Ageing: 20 రోజుల్లోనే అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గించే అలవాట్లు ఇవే!
Premature Ageing Syndrome: అకాల వృద్ధాప్య సంకేతాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న నియమాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది..
Premature Ageing Syndrome: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో అకాల వృద్ధాప్య సంకేతాలు, లక్షణాలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ముఖంపై ముడతలు, మచ్చలు, బూడిద జుట్టు, చర్మంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. చాలా మందిలో కండర బలహీనత, ఎముక సాంద్రత తగ్గడం వంటి తీవ్ర మార్పులు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు పేలవమైన జీవనశైలి అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, టాక్సిన్‌లకు గురికావడం కారణాల వల్ల ఇలాంటి వృద్ధాప్య సంకేతాలకు దారీ తీస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి ఎలా సులభంగా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సమతుల్య ఆహారం:
అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతి రోజూ సమతుల్య ఆహారం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు పెరగడం, చక్కెర, అధిక రక్తపోటు, అల్జీమర్స్ వ్యాధి, చర్మం సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలను దారీ తీసే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ధూమపానం, మద్యపానం మానుకోడం చాలా మంచిది:
వృద్ధాప్య సంకేత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ధూమపానం, మద్యపానం మానుకోడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధూమపానం చర్మానికి చాలా హానికరమని, ఆల్కహాల్ కూడా చాలా రకాల చర్మ సమస్యలకు దారీ తీస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ధూమపానం, మద్యపానం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్ర అలవాట్లు:
చెడు నిద్ర అలవాట్ల ప్రభావం కూడా చర్మంపై పడుతుంది. ఎక్కువ సేపు నిద్రపోకపోవడం వల్ల శరీరానికి సరైన విశ్రాంతి లభించదు కాబట్టి ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల పాటు మాత్రమే నిద్ర పోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిద్రపోయే క్రమంలో ఫోన్ వినియోగించకపోవడం చాలా మంచిది.
దీర్ఘకాలిక ఒత్తిడి:
దీర్ఘకాలిక ఒత్తిడి, ప్రతికూల భావోద్వేగాలు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడి, కార్టిసాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. దీని కారణంగా వేగంగా బరువు పెరుగుతున్నట్లు చర్మంలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చెడు జీవనశైలి:
ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. అయితే ఇలా ఫాలో అవడం వల్ల శరీరంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చిన్న వయసుల్లోనే ఇలాంటి వృద్ధాప్య సంకేతాలు రావడానికి జీవనశైలేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా ప్రతి రోజూ చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook