'ప్రియా ప్రకాశ్ వారియర్‌’... ఇప్పుడు ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతవరకూ ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదలకాకపోయినా.. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది. 'కన్నుగీటు' తో దేశం యావత్తును తనవైపు తిప్పుకున్న ప్రియా వారియర్ తాజాగా మరో పోస్టు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక చిన్న కుక్కపిల్లకి ఉండేలాంటి చెవులు, ముక్కును తన ఫోటోకు జతచేసి ఆ ఫోటోను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోకు ‘ఎవరైనా నాకు ఆహారం పెట్టడానికి నిరాకరిస్తే’.. అనే క్యాప్షన్‌ను పెట్టింది. పప్పి(చిన్న కుక్క పిల్ల)కి ఆహారం పెట్టకపోతే అది ఎంత అమాయకంగా చూస్తుందో.. అలాంటి హావభావాలని ప్రదర్శించి ప్రియా ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన వారికి నిజంగా నవ్వు తెప్పించకమానదు.



కొన్ని రోజుల కిందటే ప్రియ తన సహనటులు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌, వైశాక్‌ పవనన్‌, సియాద్‌ షాజహాన్‌లతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యింది.



కాగా.. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’లో నటిస్తోంది. వచ్చే నెలలలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.