అందాల పోటీల్లో తళుక్కుమన్న ప్రియా ప్రకాశ్ (వీడియో)
ఇంటర్నెట్ సంచలనం ప్రియా ప్రకాశ్ ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ.
ఇంటర్నెట్ సంచలనం ప్రియా ప్రకాశ్ ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ. భారతదేశాన్ని మొత్తం కన్నుకొట్టి ఒక ఊపు ఊపేసిన ఈ కేరళ అమ్మాయి.. గతంలో ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో ఇప్పుడు హాల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ప్రియా ప్రకాశ్ తనను తాను కాంటెస్ట్ జడ్జీలకు పరిచయం చేసుకుంటూ, వారు అడిగే ప్రశ్నలకు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సమాధానాలు చెప్తూ ఉంది. ఆ వీడియోను మీరూ చూడండి.
ప్రస్తుతం తను కేరళలోని త్రిసూర్ లో నివసిస్తున్నా.. ఒకప్పుడు మాత్రం ముంబైలో ఉండేవారు. ఈ కాంటెస్ట్ పాల్గొనే సమయానికి తను విమలా కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుండేది. ఈ వీడియోలో తనని పరిచయం చేసుకుంటూ తనకి నటన, సంగీతం అంటే ఇష్టమని చెప్పింది.
ప్రియా ప్రకాశ్ కు సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగే ఉంది. ఒక్క తన ఇంస్టా గ్రామ్ లో మాత్రమే 6.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఈ ఫాలోయింగ్ చూసి ఆమె వద్దకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టాయి. రీసెంట్ గా తను ఒక చాక్లెట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించింది.
ప్రియా ప్రకాశ్ 'ఒరు అదార్ లవ్' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. మొదట ఈ సినిమాలో ఓ చిన్న పాత్రకోసం ఆమెకు తీసుకున్నారు. ఆతరువాత ప్రియా పాపులారిటీ చూసి క్లైమాక్స్ సీన్స్ మార్చారని.. అతి త్వరలో ఈ సినిమా అన్ని భాషల్లోను (హిందీ, మళయాళం, తమిళం, తెలుగు) విడుదల చేయాడానికి సన్నాహాలు జరుగుతున్నాయని నివేదికల సారాంశం. అంతేకాదండోయ్.. ఈ మధ్యనే ఒక సినిమాకి కూడా సైన్ చేసిందట ఈ కేరళ కుట్టి.