ఒకే ఒక్క చూపుతో కుర్రకారు గుండెలను దోచుకున్న భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రియ తన కుటుంబంతో పాటు షాపింగ్‌కు వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియ ఎర్ర రంగు గౌను ధరించారు. అలాగే తన బామ్మను చెయ్యి పట్టుకొని మరీ ఎస్కలేటర్ ఎక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ షాపింగ్ మాల్‌లో ప్రియా ప్రకాష్ వారియర్‌ని చూసిన ఆమె అభిమానులు వెంటనే అవాక్కయ్యారు. ఆమె దగ్గరకు వెళ్లి పలకరిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత షాపింగ్ మాల్‌లో ప్రియ చేసిన సందడిని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆమెకు లెక్కలేనంత మంది అభిమానులను తీసుకొచ్చి పెట్టాయి.


రిషికపూర్ లాంటి సీనియర్ స్టార్లు కూడా ప్రియ హావభావాలకు ఫిదా అయ్యారు. ‘ఒరు అదార్ లవ్‌’ అనే మలయాళీ చిత్రంతో ప్రియ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే  ‘మాణిక్య మలరయ’ పాట ఆమెకు తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ పాట విడుదలయ్యాక.. తనకు వివిధ సినీ పరిశ్రమల నుండి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. నిజం చెప్పాలంటే..ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి ప్రియా ప్రకాష్.