Puri Jagannadh-Chiranjeevi : పూరి జగన్నాథ్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. హీరోలకంటూ సపరేట్ కారెక్టర్, యాటిట్యూడ్, మ్యానరిజాలు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశాడు పూరి. ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా పని చేయాలని అంతా అనుకునేవారు.  పోకిరి తరువాత పూరి జగన్నాథ్‌లో మొనాటినీ వచ్చేసింది. అదే మాఫియా, అవే బుల్లెట్ల గోలలతో సినిమాలు తీశాడు. పూరి కొత్తగా ట్రై చేసినా కూడా జనాలు ఆదరించలేదు. మళ్లీ టెంపర్ సినిమాతో లైన్లోకి వచ్చాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చే వరకు పూరి పేరు ఎక్కువగా వినిపించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక వేళ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా పోయి ఉంటే పూరి పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇస్మార్ట్ శంకర్ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ చాన్స్ ఇచ్చాడు. అంతకు ముందు అయితే పూరి ట్రై చేసినా కూడా విజయ్ చాన్స్ ఇవ్వలేదని టాక్. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ క్లిక్ అయిందో పూరికి విజయ్ చాన్స్ ఇచ్చాడు. లైగర్ సినిమాను తీశారు. దీని కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు. కరోనా వల్ల ఈ మూవీ మూడేళ్ల పాటు తీయాల్సి వచ్చింది.


తీరా సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. పూరి అవుట్ డేటెట్ స్టోరీ, నాసిరకం కథ, కథనాలు, విజయ్ దేవరకొండ ప్రమోషనల్ స్టంట్స్, చెప్పిన అతి మాటలుఇలా అన్నీ కలిసి సినిమాను నాశనం చేశాయి. అతి పెద్ద డిజాస్టర్‌గా లైగర్ నిల్చింది. ఇప్పుడు పూరి డైలామాలో పడ్డాడు. జన గణ మన సినిమాను విజయ్ ఆపేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం పూరి తన తదుపరి చిత్రం కోసం కొత్త కథను రాసుకుంటున్నట్టు తెలుస్తోంది.


ఎవరితో ఆ సినిమాను తీస్తాడో తెలియడం లేదు. కానీ లైగర్ ఫ్లాపుతో ఉన్న పూరికి గాడ్ ఫాదర్ కారెక్టర్ కాస్త ఊపిరినిచ్చింది. కొత్తగా కనిపించిన పూరిని అందరూ యాక్సెప్ట్ చేశారు. గాడ్ ఫాదర్ కోసం చిరు, పూరిలు నిన్న ఇన్ స్టా లైవ్లో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి తన ఆటో జానీ కథ గురించి అడిగేశాడు. ఆ కథను పక్కన పెట్టేశాను సర్.. దానికంటే పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాను.. త్వరలోనే కలుస్తాను సర్ అని పూరి అన్నాడు. మరి పూరితో చేసేందుకు కూడా చిరు రెడీగానే ఉన్నాడు. కానీ ఈ కథ అయినా చిరంజీవిని సంతృప్తి పరుస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఆటో జానీ కథ రెండో భాగంగా బాగా లేదని చిరు అన్నాడని పూరి హర్ట్ అయిన సంగతి తెలిసిందే.


Also Read : Ponniyin Slevan Fake Collections : ఉమైర్ సంధు ట్వీట్లపై నెటిజన్ల ఫైర్


Also Read : Ashu Reddy Bikini Photos: అషు రెడ్డి బికినీ ట్రీట్.. స్విమ్మింగ్ పూల్లో రచ్చ రేపిందిగా!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook