అశ్వథామ చిత్రం ట్రైలర్ విడుదలకు సిద్ధం
రమణ తేజ దర్శకత్వంలో ఉష మల్పూరి నిర్మాతగా ముస్తాబవుతోన్న చిత్రం అశ్వథామ. యంగ్ హీరో నాగశౌర్య తన `అశ్వథామ`ను సూపర్ డూపర్ హిట్ గా మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమైమనదిగా అభిప్రాయపడుతున్నాడు. నటి సమంతా
హైదరాబాద్ : రమణ తేజ దర్శకత్వంలో ఉష మల్పూరి నిర్మాతగా ముస్తాబవుతోన్న చిత్రం అశ్వథామ. యంగ్ హీరో నాగశౌర్య తన "అశ్వథామ"ను సూపర్ డూపర్ హిట్ గా మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమైమనదిగా అభిప్రాయపడుతున్నాడు. నటి సమంతా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయాగా, థియేట్రికల్ ట్రైలర్‌ను బ్లాక్ బస్టర్ మేకర్ పూరి జగన్నాధ్ ఆవిష్కరించనున్నారని ఫిలీంనగర్ వర్గాలు తెలిపాయి.
అశ్వథామ ట్రైలర్‌ను పూరి జగన్నాధ్ జనవరి 23న సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే, ఈ చిత్రం టీజర్ అన్ని విభాగాలలో విజయవంతమైనదని, ట్రైలర్ ద్వారా ఈ చిత్రంపై భారీ అంచనాలు నింపడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
నిజమైన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన మెహ్రీన్ పిర్జాదా నటిస్తోంది. చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చనున్నారు. గ్యారి BH ప్రొడక్షన్ కంపెనీ నుండి వస్తున్నఅశ్వథామ జనవరి 31న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..