రేపు విడుదల అనగా ఇవాళ చిక్కుల్లో పడిన 2.0 సినిమా!
రేపు విడుదల అనగా చిక్కుల్లో పడిన 2.0 సినిమా!
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 2.0 సినిమా విడుదల అవడానికి ఇంకా ఒక్క రోజు కూడా మిగిలిలేదు కానీ ఇంతలోనే ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమాపై భారతీయ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) సెంట్రల్ సెన్సార్ బోర్డ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్(ఈఎంఎఫ్) కారణంగా భూమిపై ఉన్న జీవకోటికి హాని పొంచి ఉందని ఈ సినిమాలో చూపించారని, కానీ అందులో వాస్తవం లేదని ఫిర్యాదుచేస్తూ సెంట్రల్ సెన్సార్ బోర్డ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖకు సీఓఏఐ ఓ లేఖ రాసింది.
సెన్సార్ బోర్డ్ మరోసారి 2.0 సినిమాను వీక్షించి, అందులోని కథాంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్.. సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సైతం ఉపసంహరించుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేసింది. అప్పటివరకు ఈ సినిమా ప్రదర్శన నిలిపేయాల్సిందిగా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సెన్సార్ బోర్డ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చేసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది.