భారీ బడ్జెట్ చిత్రాలు డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకునే శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.0 సినిమా ట్రైలర్ లాంచింగ్‌కి ముహూర్తం ఖరారైంది. రోబో సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాతో మొదటిసారి అక్షయ్ కుమార్ ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా హీరోగా లీడ్ రోల్స్ చేస్తూ సూపర్ ఫిట్‌నెస్ కలిగి వుండే అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో మొదటిసారిగా ఓ విలన్ పాత్ర పోషిస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించగా ఆదిల్ హుస్సేన్, సుధాన్షు పాండే ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 30న సినిమా విడుదల కానుండగా నవంబర్ 3వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ముందుకు రానుంది.