రామ్ చరణ్ `వినయవిధేయ రామ` చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషనులో వస్తున్న `వినయవిధేయ రామ` ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషనులో వస్తున్న "వినయవిధేయ రామ" ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్‌ను 9 నవంబరు, 2018 తేదిన ఉదయం 10.30 నిముషాలకు విడుదల చేయనున్నారు. శ్రీమతి డి.పార్వతి సమర్పిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ రోజు నిర్మాతలు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం జరిగింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు అద్వానీ ఖైరా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "దీపావళి శుభాకాంక్షలు... సంక్రాంతి కి కలుద్దాం" అని సందేశమిస్తూ ఈ రోజు నిర్మాతలు ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఫస్ట్ లుక్ వివిధ ఫ్యాన్ సైట్లలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే రంగస్థలం సినిమా హిట్‌తో మంచి సక్సెస్ చూసిన రామ్ చరణ్, ఈ చిత్రంతో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటకు ఈ ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే "వినయవిధేయ రామ" పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ అని మాత్రం తెలుస్తోంది. చేతిలో ఆయుధాన్ని ధరించి పరుగు తీస్తున్న కథానాయకుడు రామ్ చరణ్‌ను ఈ ఫస్ట్ లుక్ పోస్టరులో చూడవచ్చు.