పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వర్మ
సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణ అనంతరం దర్శకుడు రాంగోపాల్‌వర్మ తన ట్విట్టర్‌లో చేసిన పోస్టింగ్‌లు ఆసక్తి రేపుతున్నాయి.
సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణ అనంతరం దర్శకుడు రాంగోపాల్‌వర్మ తన ట్విట్టర్‌లో చేసిన పోస్టింగ్‌లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయన తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పవన్ ఇష్టమంటూనే.. తనకు పోర్న్ కూడా ఇష్టమని అభ్యంతరకర ట్వీట్ చేశారు. తనకు పోర్న్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఇష్టమని చెప్పారు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్‌ను, పోర్న్‌ను కలుపుతూ 'పోర్న్ కళ్యాణ్' అని సంభోదిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఈ విషయం జీఎస్‌టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) అంత నిజమైందని పోస్టు చేశారు. ట్విటర్‌లోనే ఓటింగ్ కూడా పెట్టారు. పవన్ అంటే ఇష్టమా, లేక పోర్న్ అంటే ఇష్టమా చెప్పాలని ట్విటర్‌లో ఆడియన్స్‌ని కోరారు.
వర్మ శనివారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయన వద్ద నుండి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వర్మ. తను విదేశాల్లో చిత్రం తీశాను కాబట్టి.. భారతదేశ చట్టాలు తనకు వర్తించవు అని అన్నారు. అలాగే ఓ మహిళా సామాజికకర్తను కించపరుస్తూ.. నీతో జీఎస్‌టీ తీస్తా? అని తాను అన్న మాటపై కూడా వర్మ స్పందించారు. అవి తాను ఉద్రేకం వల్ల అన్న మాటలు అని తెలిపారు. పోలీసులను కలిసిన తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర పోస్ట్ చేశారు. అంతకుముందు వర్మ తనకు పోలీసు పాత్రలో నటించాలని ఉందని కూడా ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, రాబోయే ఎన్నికల్లో తెలుగు ప్రజలకు దారిచూపే దీపంగా ఉంటుందని నేను నమ్ముతున్నానని వర్మ మరో ట్వీట్ చేశారు. ఎదురుగా నిల్చున్న వారిలో ఎవరిని ఎంచుకోవాలనే విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సలహా ఇచ్చారు.