`ముగ్గురూ ఆ టైపే...` వర్మ హాట్ కామెంట్స్
రాంగోపాల్ వర్మ పిచ్చి పీక్స్ కు వెళ్ళిందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ. తాజాగా ఆయన రాజమౌళి ట్విట్టర్ ఫోటోపై స్పందించిన విధానం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
రాంగోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇది నేను చెబుతున్నది కాదు గత కొంతకాలంగా చూస్తున్న మీకూ ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య వర్మ పెడుతున్న పోస్టులు మరీ మితిమీరిపోతున్నాయి. లేటెస్ట్ గా రాజమౌళీ పోస్ట్ చేసిన ఒక ఫొటోపై తనకు తోచిన విధంగా కామెంట్స్ చేసాడు ఈ దర్శకుడు. ఆ ఫొటోలో రాజమౌళీ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ ఉండటం విశేషం. ఒకటి కాదు.. ఏకంగా రెండు సార్లు పోస్ట్ చేసి కామెంట్లు పెట్టాడు వర్మ.
తన పేస్ బుక్ లో పెట్టిన మొదటి పోస్ట్
"మహిళని ఆరాధించేవాడిగా చెప్తున్నా.. ఈ గే సంస్కృతి ప్రమోషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నా" అంటూ మొదట ఒక పోస్ట్ పెట్టాడు.
రెండవ పోస్ట్
పిచ్చి పీక్ కు వెళ్ళిపోయి ఈసారి ఇంకో పోస్ట్ పెట్టాడు. " ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురూ ఆ టైపేనా.. పైగా ముగ్గురు కూడా పెళ్ళైనవాళ్లు.. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి నువ్వైనా చెప్పు.. బాలాజీ గారు మీరైనా చెప్పండి" అని వ్యాఖ్యలు చేసాడు.
వర్మ చేసిన ఈ దారుణమైన వ్యాఖ్యలపై మెగా, ఎన్టీఆర్ ఫాన్స్ గట్టిగానే సమాధానమిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో వర్మ ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేసి " అది కాదు.. గే కల్చర్ అంటే ఇది. మీ హ్యాండ్ అన్నింట్లోనూ ఉంటుంది" అని కామెంట్స్ చేశారు. రేపొద్దున మన హీరోలకూ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడా అంటూ.. ఆ ఫాన్స్, ఈ ఫాన్స్ అని తేడాలేకుండా వర్మ పోస్ట్ లపై విరుచుకుపడ్డారు అభిమానులు.