బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని ఆసక్తిగా వీక్షిస్తున్న అభిమానులు, ఆడియెన్స్‌కి ఈ వారాంతంలో ఊహించని ట్విస్ట్ ఎదురుకానుంది. ఆరవ వారాంతంలో కింగ్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్‌ చేసుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి నాగార్జున విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో నాగ్‌ స్థానంలో స్పెషల్‌ గెస్ట్‌గా రమ్యకృష్ణ వ్యవహరించనున్నట్టుగా తెలియజేస్తూ విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు పాత్ర పోషించిన నాగార్జునకు భార్యగా మెప్పించడమే కాకుండా నాగ్ నటించిన ఎన్నో సినిమాల్లో ఆయనకు జంటగా నటించిన రమ్యకృష్ణ నాగ్ లేనప్పుడు ఆయన స్థానంలో చేస్తోన్న ఈ హోస్టింగ్‌తో ఏమేరకు బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్‌ని, బిగ్ బాస్ షో నిర్వాహకులను మెప్పిస్తారో వేచిచూడాల్సిందే మరి.