రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనే వివాహం గురించి బాలీవుడ్‌లో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. తాజా దీనికి ఫుల్ స్టాప్ పడింది. బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొణేలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. తాము పెళ్లి చేసుకుంటున్నట్లు రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొనే అధికారికంగా ప్రకటించారు. ఈ ఇద్ద‌రి వివాహం న‌వంబ‌ర్ 14, 15 తేదిల‌లో జ‌ర‌గ‌నుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ వివాహ తేదీ ఖరారైందని, నవంబర్‌లో పెళ్లి అని రణ్‌వీర్ వివాహ ప‌త్రిక‌ను అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. నవంబర్ 14, 15 తేదీల్లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు దీపికా పదుకొనే కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. రెండు రోజులు పాటు జ‌రిగే ఈ వివాహ వేడుకుకు కుటుంబ స‌మేతంగా హాజ‌రుకావాల‌ని కోరుతూ ఆహ్వాన ప‌త్రిక‌ను ముద్రించారు. పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు పేర్కొన్నారు. సింధీ సంప్రదాయ పద్థతిలో వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు సమాచారం.


రణ్‌వీర్, దీపికా మాత్రం ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌ ‘సింబా’ సినిమాలో రణ్‌వీర్ నటిస్తున్నారు. మొఘనా గుల్జార్‌ దర్శకత్వంలో యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉండటం తెలిసిందే. అయితే నవంబర్‌లో వీరి వివాహం జరుగుతుండటంతో.. పెళ్ళికి ఎవరెవర్ని పిలవానే పనిలో పడ్డారట రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనే కుటుంబసభ్యులు.