Rashmika Mandanna Instructions to bikers travelling at Night: కన్నడ కస్తూరి రష్మిక మందన ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళుతున్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రష్మిక పలు బాలీవుడ్ ప్రాజెక్టులో భాగమైంది. రష్మిక నటించిన పలు బాలీవుడ్ ప్రాజెక్టులు విడుదలకు కూడా సిద్ధమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒకపక్క తెలుగు మరో పక్క తమిళం అలాగే హిందీ సినిమాలలో ఆమె భాగమౌతూ వెళుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న ఎప్పటికప్పుడు తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ఆమె రాత్రిపూట పనిచేసే వారి విషయంలో రష్మిక ఒక సలహా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.


ఇది అందరూ చెప్పే విషయమే కానీ నేను కూడా చెప్పాలని అనిపిస్తోంది అని అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. రాత్రి సమయంలో ఎవరైతే పనిచేయడం కోసం వెళుతున్నారో లేదా పని నుంచి ఇంటికి వెళుతున్నారో వారు ఈ వర్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్లీఎజ్ అంటూ రష్మిక మందన తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. నిజానికి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడితే రోడ్లు అద్వానంగా మారుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే.


ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గొయ్యి ఉందో అనే విషయం కూడా వాహన చోదకులకు అర్థం కాదు. అందుకే ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు ఈ విషయంలోనే రష్మిక మందన తన అభిమానులని కోరింది. ఇక ఇటీవలే సీతారామం అనే సినిమాతో రష్మిక మందన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. 
Read Also: Tollywood: ఫిలిం చాంబర్ కు డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లు.. అలా చేయాల్సిందే అంటూ!


Read Also: Bimbisara: బంపర్ హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఇదే కాదు ఈ హిట్ సినిమాలన్నీ మిస్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook