Ravikula Raghurama: ఆడియన్స్‌ను అలరించేందుకు `రవికుల రఘురామ` రెడీ.. ఈ నెల 15న థియేటర్లలోకి..!
Ravikula Raghurama Release Date: ఆడియన్స్‌ను అలరించేందుకు `రవికుల రఘురామ` రెడీ అయింది. మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Ravikula Raghurama Release Date: పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'రవికుల రఘురామ'. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పర్ఫామెన్స్ అందించారని మేకర్స్ చెబుతున్నారు.
Also Read: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్‌గా మార్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'చందమామే' అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను పాజిటీవ్ వైబ్స్ ప్రొడక్షన్స్‌లో నిర్మించారు.
యూత్‌కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు చంద్రకాంత్ కానూరి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. మూవీ మేకర్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు ఆడియన్స్‌ను అలరించాయని.. మంచి బజ్‌ను క్రియేట్ చేశాయని తెలిపారు. తమ సినిమాను థియేటర్స్‌లో చూసి ఆడియన్స్ ఆదరించాలని కోరారు.
Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter