Ramarao On Duty Business Details: చివరిగా ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందని విషయం మీద ట్రేడ్ అనలిస్టులు ఇప్పటికే కొన్ని అంచనాలు వెలువరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం ఈ సినిమా ఏరియాల వారీగా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో చూద్దాం. ఇక ఈ సినిమా నైజాం : 5 కోట్లు,  సీడెడ్: 3 కోట్లు,  ఆంధ్ర: 7 కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాలు కలిపి 15 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక కర్ణాటక సహా మిగతా ఇండియా అంతా కలిపి కోటి రూపాయలు. అలాగే ఓవర్సీస్ లో 1.2 కోట్లు బిజినెస్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ 18 కోట్లుగా ఫిక్స్ అయింది.


ఇక ఈ సినిమాకు దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అలాగే రవితేజ టీం వర్క్స్ బ్యానర్ ల మీద సుధాకర్ చెరుకూరి,  రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్,  రజీషా విజయన్,  అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి,  రాహుల్ రామకృష్ణ,  వేణు తొట్టెంపూడి వంటి వారి కీలక పాత్రలలో నటించారు.


సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని వేణు తోటెంపూడి ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం అందించగా ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,  టీజర్,  ట్రైలర్ ఆసక్తి పెంచాయి. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకోబోతుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
Read Also: Rashmika Mandanna: ర్యాంప్ పై రష్మిక అందాల జాతర.. చూపుతిప్పుకోలేనంతగా!


Read Also: Actor Nithin: కుల వివాదంలో నితిన్ దర్శకుడు.. ఆ కులాలపై దారుణ వ్యాఖ్యలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook