రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీ 20 దేశాల ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్బీఐ కొత్త వెసులుబాటు కల్పించింది. జీ 20 దేశాల ప్రయాణీకులు ఇండియాలో ఉండే సమయంలో యూపీఐ వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీఐ విధానం ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాలో డబ్బులు బదిలీ చేయవచు, తీసుకోవచ్చు. ఆర్బీఐ విదేశీ పౌరులు, ఇండియాకు వచ్చే ప్రవాస భారతీయలు వినియోగించుకునేలా అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ సౌకర్యాన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాలకు వచ్చే జీ20 దేశాల యాత్రికులకు మాత్రమే వర్తిస్తుంది. తరువాత ఈ సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయనున్నారు. 2022 డిసెంబర్ 1వ తేదీన ఇండియా జీ20 దేశాల నేతృత్వ బాధ్యతలు తీసుకుంది. జీ 20 అనేది ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల వేదిక.


ఏయే దేశాలున్నాయి


ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు జనవరి నెలలో అత్యధికంగా 1.3 శాతం పెరిగి 13 లక్షల కోట్లకు చేరుకుంది. 


Also read: Moody Report: అదానీ గ్రూప్‌కు మరో షాక్, 4 కంపెనీలకు నెగెటివ్ ర్యాంకింగ్ ఇచ్చిన మూడీస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook