హైదరాబాద్: రిలయన్స్ జియో  బంపరాఫర్ ప్రకటించింది. Work From Home పేరుతో నూతన ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం జియో తన వినియోగదారులకు హై స్పీడ్ డేటాను, వ్యాలిడిటీ 365 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటా అందుబాటులోకి రాబోతుందని, దీని కోసం రూ.2,399తో రీచార్జ్ చేసేకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ వార్షిక ప్లాన్‌ను రీచార్జ్‌ చేసుకుంటే వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుందని, రోజుకు 2GB డేటాతో పాటుగా మొత్తంగా 730 జీడీ డేటాను పొందవచ్చని  పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం


మరోవైపు జియో నుండి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ అవకాశం ఉంటుందని, జియోయేతర నెట్‌వర్క్‌కు 12,000 నిమిషాలతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఇదిలాఉండగా జియో అప్లికేషన్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుందని, దీర్ఘకాలిక వినియోగదారులకు ఈ ప్లాన్ బాగా ప్రయోజనకరంగా ఉంటుందని జియో నెట్వర్క్ పేర్కొంది. జియోలో ఇప్పటికే రూ.2,121 వార్షిక ప్లాన్ అందుబాటులో ఉండగా ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా వస్తున్న నేపథ్యంలో కొత్త వస్తున్న రూ.2,399 ప్లాన్ మరింత వెసలుబాటుగా ఉంటుందని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  


Also Read:  అందాలతో అదరగొడుతున్న RX 100 భామ