రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ట్విటర్ ద్వారా ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. కొమరం భీమ్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న తారక్ అని డీవివి ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.