Veera Simhaa Reddy First Single : బాలయ్య వీరసింహారెడ్డి సినిమా నుంచి మొదటి పాటను విడదల చేసింది చిత్రయూనిట్. అయితే ఈ పాటను రిలీజ్ చేసే కంటే కొన్ని గంటల ముందు తమన్ ఓ ట్వీట్ వేశాడు. ఇప్పుడే పాటను మొత్తం విన్నాను.. సౌండ్ బాక్సులు పగిలిపోయాయ్ అని చూపించాడు. అంటే ఇది దేవీ శ్రీ ప్రసాద్‌కు కౌంటర్‌గా వేశాడా? అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకంటే బాస్ పార్టీ అంటూ.. పగులుద్ది పార్టీ అని దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్ కొట్టి లిరిక్స్ రాశాడు. కానీ ఆ పాటను జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అందుకే దేవీ శ్రీ ప్రసాద్ మీద కౌంటర్ వేసేందుకే తమన్ అలా ట్వీట్ పెట్టాడా? అని అంతా అనుకుంటున్నారు. అసలే ఇప్పుడు వాల్తేరు వీరయ్య వర్సెస్ వీర సింహా రెడ్డి అన్నట్టుగా సోషల్ మీడియాలో అభిమానులు కొట్టేసుకుంటున్నారు. మొత్తానికి ప్రతీ ఒక్క విషయంలో మెగా, నందమూరి అభిమానుమాలు ఎంతో నిశితంగా పరిశీలించుకుంటున్నారు. ప్రతీ దాంట్లో తమదే పై చేయి అవ్వాలని అభిమానులు అనుకుంటున్నారు.


 



ఇప్పటికైతే బాస్ పార్టీ కంటే.. జై బాలయ్య అనే ఈ పాటే అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పైగా ఈ లిరికల్ వీడియోల బాలయ్య కనిపించిన తీరు కంటే తమన్ కనిపించిన తీరుకే ఎక్కువ మార్కులు కనపడేలా ఉన్నాయి. పాత ట్యూన్‌లానే అనిపిస్తున్నా.. జై బాలయ్య మాస్ ఆంథమ్‌గా మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయ్యేలానే ఉంది.


బాస్ పార్టీ, జై బాలయ్య ఆంథమ్‌లు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇలా ప్రతీ విషయంలో మెగా నందమూరి అభిమానులు వాగ్వాదానికి దిగుతుంటారు. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూనే ఉంటారు. మొత్తానికి తమన్ మాత్రం నందమూరి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.


Also Read : Alia Bhatt Daughter Name : అలియా భట్ కూతురు పేరు ఏంటంటే?.. ఏ ఏ భాషలో ఏ ఏ అర్థమంటే?


Also Read : Nandamuri Balakrishna Vs Chiranjeevi : నిన్ను తాకే దమ్మునొడు లేనే లేడయ్యా.. బాలయ్యపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కామెంట్స్.. మండిపడ్డ మెగా ఫ్యాన్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook