2 టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభం
సెంచూరియన్తో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
సెంచూరియన్తో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్లో ఇప్పుడే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మొదలుపెట్టింది. భారత్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే 21వ సెంచరీ నమోదు చేశాడు. 151 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో కోహ్లీ 103 పరుగులు నమోదు చేశాడు. ఓవర్నైట్ స్కోరు 183/5 ఉండగా.. అదే స్కోరుతో ఈ రోజు ఉదయం టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. మరోవైపు టాప్ ఆర్డర్ కూలినా.. కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగెత్తించాడు. మూడో రోజుఇన్నింగ్స్ 66 ఓవర్లో రెండు పరుగులు చేసిన కోహ్లీ కెరీర్లో 21వ సెంచరీని నమోదు చేసి రికార్డు కైవసం చేసుకున్నాడు.