నెపోటిజం (Nepotism)... గత నెలలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం మార్మోగుతున్న అంశం. దీనిపై సినీ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులతో పాటు ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న నూతన నటీనటులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘సాహో’ నటి ఎవెలిన్ శర్మ (Evelyn Sharma) సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి, వారసత్వం (Nepotism) వల్ల తనకు ఎదురైన ఓ చేధు అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఎప్పటికీ సెక్స్ వర్కర్‌గానే జీవిస్తాం.. తప్పదు!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Evelyn Sharma About Nepotism | ‘అంతగా గుర్తింపు దక్కని పాత్రలు నాకు ఇచ్చేవారు. వాళ్ల గాళ్‌ఫ్రెండ్ కోసమో, లేక బంధువుల కోసమో నన్ను రాత్రికి రాత్రే ఓ సినిమా నుంచి తప్పించారు. నేను ఊహించలేకపోయా. కానీ ఇలాంటి పరిస్థితులు నన్ను మరింత దృఢంగా చేశాయంటూ’ సాహో బ్యూటీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘కొన్నిసార్లు పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. డ్రింక్ పార్టీలకు ఆహ్వానించేవారు. నేను రాకపోవడం గమనించి, నువ్వు ఎందుకు పార్టీలకు రావు అని ప్రశ్నించేవాళ్లు. నాకు తెలిసినంతవరకు నెపోటిజం అంటే.. పవర్, మనీ గేమ్ అని భావిస్తాను. వీటికోసం చాలా మంది చేతులు కలుపుతారు. నా వరకు ఇలాంటివాటికి వీలైంత దూరంగా ఉంటాను.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్     


బాలీవుడ్‌లో 10ఏళ్ల కెరీర్‌లో దాదాపు 15 సినిమాలు చేశాను. అయితే నాకు హిందీ డైలాగ్స్ (సొంతంగా డబ్బింగ్ లాంటివి) చెప్పుకోవడం రాదని ప్రేక్షకులు భావిస్తున్నారంటే  పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇది నన్ను చాలా నిరాశపరిచింది. నాతోపాటు ఎల్లీ అవ్రామ్, ఎల్నాజ్ కూడా ఇదే కోవలో ఉన్నారు. అందుకే నేను సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నా. నా కష్టార్జితంతో ముంబైలో సొంతింటి కలను నెరవేర్చుకున్నాను. మార్కెటింగ్ వ్యవహారాలతో పాటు ఛారిటీ ఫౌండేషన్‌ను బాధ్యతలతో నా లైఫ్ బిజీ. సొంతంగా ఎదిగితే కొంతమేర కష్టాలు దూరమవుతాయి. Eevelyn Sharma Hot Photos: సాహో బ్యూటీ అందాల సునామీ


సినిమాల విషయానికొస్తే ఓ కామెడీ జానర్ మూవీ, మరికొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుతుందో, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేను. కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోందని’ హిందూస్థాన్ టైమ్స్ మీడియాతో ఎవెలిన్ శర్మ ఈ విషయాలు షేర్ చేసుకుంది. ‘యే జవానీ హే దివానీ’, మై తేరా హీరో, సాహో సినిమాలతో ఎవెలిన్ శర్మ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..