మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశారు. తాజాగా ఆదర్శ వివాహం చేసుకుని ఒక్కటైన సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌లకు సచిన్ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ పొరపాటు దొర్లింది. సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌ కలిసి వున్న ఫోటోకు బదులుగా మరో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ - సైనా నేహ్వాల్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సచిన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ ట్వీట్‌లో పొరపాటు గుర్తించిన ట్విటర్ యూజర్స్.. మీరు పప్పులో కాలేశారు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే తన తప్పిదాన్ని పసిగట్టిన సచిన్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి సరైన ఫోటోతో మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే సచిన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING