ప్రభాస్ హీరోయిన్ అంటే ఇక్కడ ప్రభాస్ ఇష్టపడే హీరోయిన్ అనుకుంటున్నారా ?.. కానే కాదు.. సరే ప్రభాస్ పెళ్లి చేసుకునే హీరోయిన్ అనుకుంటున్నారా ? అదీ కాదు.. ఇంతకీ ఎవరా హీరోయిన్..ఎవరితో పెళ్లి అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లో వెళ్లండి మరి..మీకే అర్థమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాహో ఘూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది మార్చి లోపు పెళ్లి చేసుకుంటుందంటూ బాలీవుడ్ లో రూమర్స్ నడుస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ్ తో శ్రద్ధాకపూర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందట. అతడ్నే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోందట. శ్రద్ధాకపూర్ పై ఇంతలా పుకార్లు రావడానికి మరో రీజన్ ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి ఈమె తప్పుకుంది. అప్పట్నుంచి ఈమె పెళ్లిపై ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి.



బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక హీరోయిన్ పెళ్లి కబురు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. గమ్మత్తుగా అవి నిజాలు అవుతుంటాయి కూడా. కత్రినాకైఫ్ ది తప్పిస్తే… కరీనా, సోనమ్, నేహా ధూపియా, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి ఎంతోమంది ముద్దుగుమ్మల విషయంలో బాలీవుడ్ గాసిప్స్ నిజమయ్యాయి. ఇప్పుడిలాంటిదే మరో గాసిప్ పుట్టుకొచ్చింది. మరి శ్రద్ధాకపూర్ పెళ్లి విషయంలో ఈ రూమర్స్ నిజమౌతాయా లేదా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది..