1998లో నల్లజింకలను వేటాడి హతమార్చిన కేసులో 5 సంవత్సరాల జైలుశిక్షను పొందిన సల్మాన్ ఖాన్ ఇటీవలే బెయిల్ పై మళ్లీ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులను ఉద్దేశించి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. "ఇవి కన్నీళ్లతో కూడిన కృతజ్ఞతలు. నమ్మకాన్ని కోల్పోకుండా నాతో పాటు నిలిచినవారికి, నన్ను ప్రేమించిన వారందరికీ ఇవే నా ధన్యవాదాలు. మిమ్మల్ని దేవుడు చల్ల చూడాలి" అని ఆయన ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సల్మాన్ ఖాన్ రెండు రోజులు జైలులో ఉన్నారు. శనివారం సాయంత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని సొంత ఇంటిలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, సిమి అగర్వాల్, ప్రీతి జింటా లాంటి సినీ ప్రముఖులు అందరూ ఆయనకు మద్దతు తెలిపారు. 


సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు తన చెల్లెళ్లు అల్విరా, అర్పితా కూడా ఆయన వెంట జోధ్‌పూర్‌కి వెళ్లారు. సల్మాన్ సోదరి అర్పిత తన అన్న కోసం ఒక ఉద్వేగభరితమైన ఉత్తరాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సల్మాన్ కేసుకి సంబంధించిన తదుపరి హియరింగ్ మే 7వ తేదిన జరగబోతోంది. సల్మాన్ జైలు నుండి రాగానే, తన నటిస్తున్న రేస్ 3 సినిమా టీమ్‌ను కలిసి మాట్లాడారు. అలాగే తన మిత్రుడు సలీమ్ సఖీబ్ పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరయ్యారు.