100 మంది చిన్నారులకు కడుపు నిండా అన్నం పెడుతున్న సమంత
సమంత సేవకు సోషల్ మీడియా వందనం
సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వచ్చంద సేవా సంస్థని స్థాపించి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమంత తాజాగా మరో మంచి పని చేసి నెటిజెన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. అక్కినేని వారి ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంటికి కోడలిగానూ సమంత మరింత సామాజిక సేవ చేస్తుండటం అభినందించదగిన విషయం. అక్కినేని నాగార్జున కుటుంబానికి పెద్ద కోడలిగా హుందాగా వ్యవహరిస్తూ సమంత తాజాగా తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మొత్తం వంద మంది చిన్నారులకి తమ కుటుంబం ఒక పూట భోజనం అందిస్తోంది. అలా మీరు కూడా మీ వంతు సహాయం అందించి చిన్నారుల ఆకలి తీర్చండి అని సమంత ఈ ట్వీట్ ద్వారా తన అభిమానులు, నెటిజెన్స్‌ని విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక రూ.950లతో ఒక విద్యార్ధికి ఏడాది మొత్తం రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించవచ్చని సమంత విజ్ఞప్తి చేసిన విధానం సోషల్ మీడియాలో అభిమానుల మన్ననలు అందుకుంటోంది.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం అందిస్తున్న అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చిన్నారులకి సమంత చేసిన ఈ సహాయం ఇప్పుడామె అభిమానులను ఆకట్టుకుంటోంది. తమ అభిమాన నటిని స్పూర్తిగా తీసుకుని ఇంకొంత మంది అభిమానులు ముందుకొస్తే, తాను సేవ చేస్తూ... మరో నలుగురి చేత సేవ చేయించాలనుకున్న ఆమె ప్రయత్నానికి ప్రతిఫలం దక్కినట్టే కదా మరి!!