Samantha: చైతూతో కలిసి ఉన్న ఇంటిని వదలని సమంత.. భారీ ధర పెట్టి మళ్లీ కొనుగోలు!
Samantha Re-brought Jayabheri Penthouse: సమంత మళ్లీ నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని మళ్లీ కొనుగోలు చేసినట్టు మురళీమోహన్ వెల్లడించారు. దానికి కారణాలు కూడా ఆయన వెల్లడించారు.
Samantha Re-brought Jayabheri Penthouse: సమంత, నాగచైతన్య గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. వారి విడాకుల వార్తలు మొదలు వారి గురించి రకరకాల ప్రచారాలు అయితే అవుతూ ఉంటాయి. తాజాగా సమంత నివసిస్తున్న ఇంటి గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ సంచలన విషయం బయట పెట్టారు. నిజానికి మురళీమోహన్ నిర్మించిన జయభేరి అపార్ట్మెంట్స్ లోని ఒక పెంట్ హౌస్ ను నాగచైతన్య పెళ్లికి ముందే చూసి ఇష్టపడి కొనుక్కోవాలి అనుకున్నారు.
మురళీమోహన్ అది తన కుటుంబ సభ్యుల కోసమే ఉంచానని అది అమ్మే ఉద్దేశం లేదని చెప్పడంతో నాగార్జున ఒప్పించి మరీ చైతన్య, సమంత కలిసి నివాసం ఉండేందుకు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంట్లో నివాసం ఉంటూ ఉండగానే ఒక ఇండివిడ్యువల్ హౌస్ కట్టించుకోవాలని నాగచైతన్య, సమంత భావించారు. ఈ క్రమంలో తాము నివసిస్తున్న పెంట్ హౌస్ ను వేరే వారికి అమ్మేశారు. అయితే కొత్త ఇంటి నివాసం రెడీ అయ్యే వరకు అందులోనే ఉంటామని ఆ కొత్త వారిని కూడా ఒప్పించారు.
ఇక్కడదాకా బాగానే ఉంది కానీ ఆ కొత్త ఇంట్లోకి మారకుండానే నాగచైతన్య, సమంతాలకు విడాకులు అయిపోయాయి. ఇప్పుడు నాగచైతన్య కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. సమంత కూడా వేరేచోట నివాసం ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ జయభేరి పెంట్ హౌస్ లో ఉన్నంత కంఫర్ట్ కానీ సెక్యూరిటీ పరిధులు కానీ ఇంకెక్కడా దొరకలేదట. ఈ నేపథ్యంలోనే తనకు ఎక్కడా మంచి ఇల్లు దొరకలేదని ఇందులోనే ఉంటానని మళ్లీ ఆ ఇల్లు తానే కొనుక్కుంటానని సమంత మురళీ మోహన్ ను అడిగిందట. అది వేరే వాళ్ళకి అమ్మేశాం కదా మళ్ళీ అలా ఎలా అడుగుతాం అంటే మీరే ఎలా అయినా ఒప్పించమని అడగడంతో ఆయన మళ్లీ వాళ్ళను ఒప్పించి సమంత ఆ ఇల్లు కొనుగోలు చేసేలా చేశారంట.
అయితే సమంత ఇల్లు మళ్ళీ దక్కించుకోవడం కోసం భారీగా ఖర్చుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. సెక్యూరిటీ ఎక్కువగా ఉండటమే కాక పెంట్ హౌస్ తో ఇంకెవరితో ఇబ్బంది ఉండదని, ఒకసారి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటే తానంతట తాను బయటకు వచ్చేవరకు ఇబ్బంది ఉండకపోవడంతో సమంత అంత డబ్బు వెచ్చించిందని అలా ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. ఈ ఇంట్లో ప్రస్తుతం సమంత తో పాటు ఆమె తల్లి మాత్రమే నివసిస్తున్నారని తాజాగా మురళీమోహన్ వెల్లడించారు. ఈ వార్తలు ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Ashwini Dutt: నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్.. వారి నిర్ణయమే శిరోదార్యం అంటూ!
Read Also: Liger Attitude: విజయ్ ఇచ్చి పడేశాడుగా... దుమ్ము రేపుతున్న లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook