Amazon Great Freedom Festival: ప్రముఖ ఈకామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అటు అమెజాన్ 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' పేరుతో, ఇటు ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' పేరిట ఒకేసారి ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్ల ద్వారా చిన్న చిన్న వస్తువులు మొదలు లగ్జరీ వస్తువుల వరకు భారీ డిస్కౌంట్స్‌తో తక్కువ ధరకే పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌ 'గ్రేట్ ఫీడ్రమ్ ఫెస్టివల్' సేల్‌లో అతి చౌక ధరకే అందుబాటులో ఉన్న శాంసంగ్ స్మార్ట్ టీవీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్ :


32 అంగుళాల శాంసంగ్ వండర్టైన్‌మెంట్ సిరీస్ హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.22,900. కానీ అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.14,989కే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.7911 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.1500 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ టీవీని మరింత చౌకగా రూ.13,489కే మీ సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్ :


శాంసంగ్ వండర్టైన్‌మెంట్ సిరీస్ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.4280 వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఈ ఆఫర్‌లో గరిష్ఠ ధర పొందాలంటే ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే హ్యాండ్ సెట్ కండిషన్ సరిగా ఉండాలి. 


ఒకవేళ పూర్తి ఆఫర్ దక్కించుకున్నట్లయితే రూ.14,989కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.10,709కే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే.. రూ.22,900 విలువ చేసే టీవీని సగం కన్నా తక్కువ ధరకే దక్కించుకునే ఛాన్స్ పొందవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అందుబాటులో ఉండే ఆగస్టు 6-10 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.


శాంసంగ్ వండర్టైన్‌మెంట్ సిరీస్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ :


  • బ్రాండ్ : శాంసంగ్

  • మోడల్ : UA32T4340BKXXL

  • స్క్రీన్ : 32 అంగుళాలు 

  • రిజల్యూషన్ : 769p

  • మోడల్ ఇయర్ : 2021

  • సౌండ్ : 30 వాట్స్


Also Read: Balineni Srinivas Reddy: జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి? పవన్ కల్యాణ్ ట్వీట్ సంచలనం...


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ ఎప్పుడు.. ఎంత పెరిగే ఛాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook