తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో సంజన గల్రాని ( Sanjjana Garlani ) పేరు అందరికీ సుపరిచితమే. సంజన స్నేహితుడు రాహుల్ డ్రగ్స్ కేసులో ( Drug abuse case ) అరెస్ట్ అయిన అనంతరం ఆమెకు కూడా డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి. దీనికితోడు ఇప్పటికే రాగిణి ద్వివెదిని ( Actress Ragini Dwivedi ) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఏ సమయంలోనైనా సంజనకు కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. Also read : డ్రగ్స్ కేసులో నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్


డ్రగ్స్ కేసులో డ్రగ్స్ డీలర్స్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై సంజన గల్రాని స్పందించింది. కన్నడ మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేసిన సంజన.. తనను డ్రగ్స్ కేసులో లాగొద్దని.. డ్రగ్స్ డీలర్స్‌తో కానీ లేదా డ్రగ్స్ వాడే వాళ్లతో కానీ తనకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టంచేసింది. ఏదేమైనా శాండల్‌వుడ్‌లో ఈ డ్రగ్స్ కేసు ( Sandalwood drugs case ) ఎప్పుడు ఎటువంటి ప్రకంపనలు అయినా సృష్టించొచ్చని అక్కడి మీడియా పేర్కొంటోంది. Also read : Pooja Hegde: సిటీలో ఖరీదైన ఇంటికి ప్లాన్ చేస్తున్న కన్నడ బ్యూటీ