సవ్యసాచి టైటిల్ సాంగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్
సవ్యసాచి సినిమాపై హైప్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది. దసరా కానుకగా ఈరోజు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
సవ్యసాచి సినిమాపై హైప్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది. దసరా కానుకగా ఈరోజు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాట అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిజంను ఎలివేట్ చేస్తూ, హై-టెంపోలో ఈ సాంగ్‌ను కంపోజ్ చేశాడు కీరవాణి.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ అవేవీ క్రియేట్ చేయని హైప్‌ను ఈ టైటిల్ సాంగ్ క్రియేట్ చేసింది.
తాజా పాటతో సవ్యసాచిపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో “నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు” అనే సాంగ్ రీమిక్స్ కూడా ఉంది. ఈ పాటను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నారు.
అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమిక చావ్లా, ముకుల్ దేవ్, వెన్నెల కిషోర్, దిశితా సెహగల్, రావు రమేష్, తాగుబోతు రమేష్, భరత్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, సివి మోహన్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. జి యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 2018 నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉండడం వల్ల జూన్ తర్వాత రిలీజ్ చేయాలని భావించారు. ఆ తర్వాత అది కూడా జరగలేదు. ఆఖరికి నవంబరులో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు.