తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'కాలా' మూవీపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరూ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో సినిమా విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాలా మూవీ విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కర్ణాటకలో కాలా సినిమాకి వ్యతిరేకంగా కన్నడ పరిక్షణ వేదిక, మరికొన్ని కన్నడ సంఘాలు సినిమా విడుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా జూన్ 7న కాలా మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది.


మంగళవారం కర్ణాటకలో కాలా మూవీ ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని కర్ణాటక హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.


'కాలా’ సినిమా విడుదలకు కర్ణాటక సీఎం సహకరించాలి: రజినీకాంత్


'కాలా’ సినిమా విడుదలకు కర్ణాటక సీఎం కుమారస్వామి సహకరించాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కాలా చిత్రం విడుదలయ్యే థియేటర్ల వద్ద భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. కావేరి సమస్యను ‘కాలా'తో ముడిపెట్టడం సరికాదన్నారు.