Seetha Kalyana Vaibhogame First Look Poster: ప్రస్తుతం సినిమాలపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయడం ఓ పెద్ద టాస్క్‌గా మారింది. ముఖ్యంగా మూవీ టైటిల్‌తోనే చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో 'సీతా కళ్యాణ వైభోగమే' అనే మూవీ రూపొందుతోంది. ఇటీవల అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభం తరువాత దేశం మొత్తం జై శ్రీరామ్ నినాదం మార్మోగిపోతుంది. రీసెంట్‌గా హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇక సీతా కళ్యాణ వైభోగమే అంటూ రానున్న ఈ చిత్రం టైటిల్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తుండగా..  డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై  రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్ అండ్ యాక్షన్ మూవీగా రాబోతున్నట్లు పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో డిజైన్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. నిర్మాత రాచాల యుగంధర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. రీసెంట్‌గా గోవాలో ఓ సాంగ్‌ను షూట్ చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. అదేవిధంగా 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సీన్స్ మూవీకి హైలెట్ కానున్నాయని చిత్రబృందం చెబుతోంది. 


ప్రస్తుతం సీతా కళ్యాణ వైభోగమే మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో గగన్ విహారి విలన్‌గా నటిస్తున్నారు. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా చరణ్ అర్జున్ పనిచేస్తున్నారు. కెమెరామెన్‌గా పరుశురామ్ వ్యవహరిస్తుండగా.. ఎడిటర్‌గా డి.వెంకట ప్రభు వర్క్ చేస్తున్నారు. ఫైట్స్‌ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ సమకూర్చారు. కొరియోగ్రాఫర్లుగా భాను మాస్టర్, పోలకి విజయ్ వర్క్ చేస్తున్నారు.


Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన


Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’


 


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook